News21st Oct 12:13 PMSunil Byrisetty1 min read

సమాజంలో అశాంతి సృష్టించేవారిని ఉపేక్షించను

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సంస్మరణ దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. ఏ రాష్ట్రానికైనా శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమైనవన్నారు. గూగుల్ 15 బి

సమాజంలో అశాంతి సృష్టించేవారిని ఉపేక్షించను
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సంస్మరణ దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. ఏ రాష్ట్రానికైనా శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమైనవన్నారు. గూగుల్ 15 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడి విశాఖపట్నానికి వచ్చాయంటే లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం ఉండటమే కారణమని తెలిపారు. ఏ రాష్ట్రంలో లా అండర్ ఆర్డర్ సక్రమంగా ఉంటుందో, ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందో, వారు పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందో అక్కడే ఆర్థిక సంస్కరణలు వచ్చాక అతి పెద్ద పెట్టుబడి అయిన 15 బిలియన్ యూఎస్ డాలర్లతో డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం వెచ్చిస్తున్నారని వివరించారు. ఇది ప్రపంచానికే ఒక హబ్ గా తయారవుతుందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ ప్రారంభించాం, ఇప్పుడు ఏఐ, గూగుల్ డేటా సెంటర్ తో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇవన్నీ ఒకటైతే, సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొంతమంది కొత్త కొత్త నేరాలకు పాల్పడుతున్నారని, అయినా భయం లేదు, నేరాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.
Andhra Pradesh
Chief Minister
Police Martyrs Day
Law and Order
Visakhapatnam
Google Investment
అభివృద్ధి
డేటా సెంటర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
రాజకీయ నేరాలు
అశాంతి
Scroll for the next article