News16th Apr 04:13 PMSunil Byrisetty1 min read

ఏపీకి సాయం అందించండి.. కేంద్ర బృందంతో సీఎం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసి

ఏపీకి సాయం అందించండి.. కేంద్ర బృందంతో సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని.. దృఢమైన నిర్ణయాలతో, ఉత్తమ పాలసీలతో పాలన సాగిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామని వివరించారు. రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్‌కు అనేక సమస్యలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఈ కారణంగానే ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. 2019 తరువాత నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సీఎం వివరించారు. గత 10 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం అందించాలని, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫారసులు చేయాలని సీఎం విన్నవించారు.
Andhra Pradesh
finance commission team
Chandra babu naidu
ప్రభుత్వం 15 శాతం గ్రోత్ రేట్
రాజధాని
16వ ఆర్థిక సంఘం
Scroll for the next article