Politics15th Mar 05:52 PMSunil Byrisetty1 min read

పాస్ అవుతారా.. ఫెయిల్ అవుతారా? చంద్రబాబు సీరియస్

‘నా చుట్టూ తిరిగితే లాభం లేదు.. మీ పని ప్రజలు చుట్టూ తిరుగుతూ ఓట్లేయించడం.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం మీ మైండ్‍లో ఎప్పుడూ 2029 ఎన్నికలు గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబ

పాస్ అవుతారా.. ఫెయిల్ అవుతారా? చంద్రబాబు సీరియస్
‘నా చుట్టూ తిరిగితే లాభం లేదు.. మీ పని ప్రజలు చుట్టూ తిరుగుతూ ఓట్లేయించడం.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం మీ మైండ్‍లో ఎప్పుడూ 2029 ఎన్నికలు గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఈసారి పోటీ చేసిన 3 చోట్లా టీడీపీ గెలుపొందిందని, టీడీపీ కార్యకర్తలకి ఇకపై ఏ ఎన్నికైనా ఒక పరీక్షేనని చెప్పారు. ఇకపై జీవితాంతం మీకు పరీక్షలేనని, పాసైతే పాసైనట్టు.. ఫెయిల్ అయితే ఫెయిలైనట్లు అని వ్యాఖ్యానించారు. పనితీరు బాగోలేని క్లస్టర్ ఇంఛార్జులను తీరు మార్చుకోవాలని మందలించారు. తణుకు సభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని మండిపడ్డారు. “గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లు. ప్రజల సమస్యలు వినేందుకు కనీసం మాట్లాడనిచ్చేవారు కాదు. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా.. గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు మనకు మిగిల్చి వెళ్లింది” అని చంద్రబాబు తెలిపారు.
Chandrababu
Andhra Pradesh
News
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్
వార్తలు
Scroll for the next article