News8th Dec 04:53 PMSunil Byrisetty1 min read

గత ప్రభుత్వ పాపాలే.. అభివృద్ధికి శాపాలు

2025-26 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థిర ధరల వద్ద రాష్ట్ర ఆర్థిక వృద్ధి, రాష్ట్ర స్థూ

గత ప్రభుత్వ పాపాలే.. అభివృద్ధికి శాపాలు
2025-26 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థిర ధరల వద్ద రాష్ట్ర ఆర్థిక వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ), గ్రాస్ వాల్యూ అడిషన్, అలాగే వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాల వృద్ధి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఆర్థిక రంగానికి భారీ నష్టం వాటిల్లిందని, తదనంతరం 2019 నుంచి 2024 వరకు జరిగిన పాలనలో ప్రభుత్వ వ్యవస్థలు డీఫంక్ట్ కావడంతో రాష్ట్ర అప్పులు ప్రమాదకర స్థాయికి చేరిపోయాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకారక నిర్ణయాల వల్ల రాష్ట్ర గ్రోత్ రేటు తీవ్రంగా పడిపోగా, దాదాపు ₹7 లక్షల కోట్ల జీఎస్డీపీ నష్టం, అలాగే గ్రోత్ రేట్ లేకపోవడం వల్ల మరో ₹76,195 కోట్ల ఆదాయం కోల్పోయామని చంద్రబాబు తెలిపారు. అధిక వడ్డీలతో అప్పులు తీసుకోవడం ప్రజాధనానికి నేరుగా నష్టం కలిగించిందని, రాష్ట్రం ఇప్పుడు రుణాల రీ-షెడ్యూలింగ్ దశకు చేరాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తగ్గడంతో వడ్డీ రేట్లు పెరిగిపోయి రెవెన్యూ-జీఎస్డీపీలో కూడా భారీ నష్టాలు నమోదైయ్యాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, 25 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఐటీ పాలసీ వల్లే తెలుగు ప్రజల తలసరి ఆదాయం దేశంలో అత్యున్నత స్థాయికి చేరిందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం ఎప్పుడూ తన ప్రాధాన్యతే అని ముఖ్యమంత్రి నాయుడు స్పష్టం చేశారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Economic Growth
GSDP
Agriculture
Industry
Services Sector
Government Policy
ప్రజా ఆర్థికాలు
ఆదాయం నష్టం
రుణాల రీ-షెడ్యూలింగ్
ఆర్థిక నివేదిక
Scroll for the next article