News11th Nov 03:34 PMSunil Byrisetty1 min read
పారిశ్రామిక పండుగ.. 25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమలు
రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న 50 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఏర
రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న 50 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదన దశకు చేరుకున్న రూ.25,256 కోట్ల పెట్టుబడులతో కూడిన 25 పరిశ్రమలను కూడా ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రెండో దశ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో భాగంగా ఈరోజు 329 ఎకరాల్లో విస్తరించి ఉన్న 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే మరో 587 ఎకరాల్లో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.