News13th Sep 05:26 PMSunil Byrisetty1 min read
పేదలకు అండగా సీఎం సహాయ నిధి
పేద ప్రజలకు వైద్య అత్యవసర పరిస్థితులు, అనుకోని ఆర్థిక ఇబ్బందులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి వాసంశెట్టి సుభా
పేద ప్రజలకు వైద్య అత్యవసర పరిస్థితులు, అనుకోని ఆర్థిక ఇబ్బందులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. 34 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.38.87 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకం చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజల కష్టాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని సీఎం సహాయ నిధి మరింత బలపరుస్తోందన్నారు.