News17th May 12:10 PMSunil Byrisetty1 min read
11 నెలల్లో.. కోటిన్నర సీఎం సహాయ నిధి
సీఎం సహాయనిధితో పేద ,బడుగు, బలహీన వర్గాల వారికి మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో గుడివాడ నియోజకవర
సీఎం సహాయనిధితో పేద ,బడుగు, బలహీన వర్గాల వారికి మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.
గుడివాడ ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో గుడివాడ నియోజకవర్గ పరిధిలోని బాధిత కుటుంబాలకు రూ. 30 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి సిఫార్సు పత్రాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అందచేశారు.
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్‌తో మెరుగైన వైద్యం అందుతుందని గుర్తుచేశారు.
గడచిన 11 నెలల కాలంలో గుడివాడ నియోజకవర్గ పరిధిలో బాధిత కుటుంబాలకు కోటిన్నర సీఎం సహాయనిధి చెక్కులు అందించామన్నారు.
ఆస్పత్రిలో చేరిన వారు సీఎం రిలీఫ్‌ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న కొద్దిరోజులకు చెక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బాధిత కుటుంబాలకు భరోసా కల్పించి సహాయం అందించేలా ప్రజావేదిక కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
నియోజకవర్గ పరిధిలోని బాధిత కుటుంబాలు ప్రజా వేదిక టిడిపి కార్యాలయం దృష్టికి తమ సమస్యను తీసుకొస్తే చాలని, చెక్కులు మంజూరు అయ్యేవరకు జరగాల్సిన ప్రక్రియ అంతా బాధిత కుటుంబాలకు సహాయంగా తామే చూసుకుంటామన్నారు.