Telangana21st Jan 12:45 PMSunil Byrisetty1 min read

దావోస్‌లో మెరిసిన చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి దావోస్‌లో మెరిశారు. దావోస్ లో డబ్ల్యూఈఎఫ్ సదస్సులో చిరు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రజెంటేషన్‌ను చిరు ఆసక్

దావోస్‌లో మెరిసిన చిరంజీవి
మెగా స్టార్ చిరంజీవి దావోస్‌లో మెరిశారు. దావోస్ లో డబ్ల్యూఈఎఫ్ సదస్సులో చిరు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రజెంటేషన్‌ను చిరు ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత రేవంత్, మంత్రులతో కలిసి విందు భోజనం చేశారు. అయితే, దావోస్ టూర్ కు ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి అక్కడకు ఎందుకు వెళ్లారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 2025లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో, చిరు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెడతారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Telangana Rising Global Summit
Chiranjeevi
Davos
World Economic Forum
WEF Summit
Telangana Vision
Revanth Reddy
Mega Star
Davos Tour
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
రాజకీయ ఊహాగానాలు
సోషల్ మీడియా చర్చ
Scroll for the next article