News16th Apr 09:07 AMSunil Byrisetty1 min read

లిఫ్ట్‌లో సీఎం రేవంత్.. తృటిలో తప్పిన ప్రమాదం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ సమావేశం సందర్భంగా హైదరాబాద్ నోవాటెల్ హోటల్‍కు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన ఎక్కిన

లిఫ్ట్‌లో సీఎం రేవంత్.. తృటిలో తప్పిన ప్రమాదం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ సమావేశం సందర్భంగా హైదరాబాద్ నోవాటెల్ హోటల్‍కు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన ఎక్కిన లిఫ్ట్‌‌లో పలువురు నాయకులు, అధికారులు ఎక్కడంతో ఓవర్ వెయిట్‌ కారణంగా ఫ్లోర్ బేస్ కన్నా కిందకి దిగిపోయింది. దీంతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి లిఫ్ట్‌ను సెట్ చేశారు. అనంతరం మరో లిఫ్ట్‌లో ముఖ్యమంత్రిని అధికారులు తరలించారు. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డితోపాటు 13 మంది ఎక్కారు. అందుకే ఇలా జరిగిందని గుర్తించారు.
Telangana
CM Revanth
Novotel
Lift Accident
రేవంత్ రెడ్డి లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు
తృటిలో ప్రమాదం తప్పింది
హైదరాబాద్ నోవాటెల్ హోటల్‍
Scroll for the next article