Telangana24th Jan 12:32 PMSunil Byrisetty1 min read
టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలి
టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు వస్తున్న వార్త
టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడారు.
అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ-హబ్‌ను ప్రత్యేకంగా స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర కార్యాలయాలు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.