Telangana18th Nov 03:37 PMSunil Byrisetty1 min read
పెద్దన్న మోదీ సహకరిస్తే అభివృద్ధి: రేవంత్ రెడ్డి
దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభి
దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకమవుతుందని అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ మరో కొత్త నగరాన్ని నిర్మించాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ రైజింగ్-2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, మిగతా సమయాల్లో పరస్పరం సహకారంతో అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు.