Politics5th Apr 04:13 PMSunil Byrisetty1 min read
చంద్రబాబు ప్రభుత్వంపై సుప్రీంకు రేవంత్
చంద్రబాబు ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ శా
చంద్రబాబు ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది.
ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది.
స్టాండింగ్ కమిటీ, అడ్వకేట్ జనరల్‌తో చర్చించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి అనుమతులు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోబోమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అక్రమంగా నిధులు తెచ్చి, నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించనుంది. చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రజల తరుపున పోరాడి తీరుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు.