Politics28th Mar 07:46 AMSunil Byrisetty1 min read
నేను అనుకుంటే కేసీఆర్ కుటుంబం జైలుకే.. రేవంత్ ఫైర్!
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో మాజీ స
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తనదైన శైలిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడతారు. ఈ సందర్భంగానే.. తాను ఎన్నికల్లో ఇచ్చిన ఓ హామీని అమలు చేయలేదని అసెంబ్లీ సాక్షింగా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు.
మరి ఆ హామీ ఎంటంటే..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
"నేను కక్ష సాధింపునకు పాల్పడితే మీ కుటుంబం అంతా చంచల్‌గూడలో ఉండేవారు.
ఎంపీగా ఉన్న నన్ను ఆరోజు చర్లపల్లి జైలుకు పంపారు.
బిడ్డ పెండ్లి పత్రిక పెట్టుకునేందుకు కూడా పంపకపోతే.. సుప్రీం కోర్టు లాయర్ల ద్వారా కండీషన్ బెయిల్ తెచ్చుకున్నా.
ఎన్ కన్వెన్షన్‌లో పెండ్లి పత్రిక రాసుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడా జైలుకే వెళ్లా. 16 రోజులు డిటెన్షన్ సెల్‌లో నన్ను నిర్బంధించారు.
జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. దేవుడు అన్ని చూస్తాడు అని వేచిచూశా.
నేను ప్రమాణస్వీకారం చేసిన రోజే వాళ్లు ఆస్పత్రి పాలయ్యారు.
" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.