Telangana10th Jul 09:49 AMSunil Byrisetty1 min read

కేసీఆర్‌, జగన్‌ వల్ల తెలంగాణకు నష్టం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ మాజీ సీఎం జగన్‌ అనుబంధం వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లిందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, వైసీపీ అధ్యక్షుడు వ

కేసీఆర్‌, జగన్‌ వల్ల తెలంగాణకు నష్టం
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ మాజీ సీఎం జగన్‌ అనుబంధం వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లిందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ప్రణాళికలు నష్టం కలిగించాయన్నారు. రాష్ట్రానికి నష్టం జరగకుండా వారిద్దరూ అనుబంధం పెంచుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. "బేసిన్లు లేవు.. భేషజాల్లేవు.. గోదావరిలో 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి" అని గతంలో కేసీఆర్‌ అన్నారని సీఎం గుర్తు చేశారు. జగన్‌కు సూచనలతో పాటు టెండర్లు, జీవోలు ఇచ్చేలా నాడు కేసీఆర్ సహకరించారని మండిపడ్డారు. అందువల్ల ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల్లో నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
Telangana News
ys jagan
Cm Revanth Reddy
Kcr
krishna river
telangana suffering immense losses with kcr
కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ నిర్ణయాలు ఓ మరణశాసనం
Scroll for the next article