Politics17th Mar 12:15 PMSunil Byrisetty1 min read
ఎంపీ ఇంట్లో ఆగంతకుడు.. ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన తీరును, తన అనుమానాలను రేవంత్ రెడ
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు.
ఘటన జరిగిన తీరును, తన అనుమానాలను రేవంత్ రెడ్డి దృష్టికి డీకే అరుణ తీసుకువచ్చారు. భద్రత పెంచుతామని డీకే అరుణకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
భద్రత పెంచాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలిచ్చారు.
జరిగిన ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగితే పట్టించుకొని రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఇంట్లో చోరీ జరిగితే ఎంపీని ఫోన్లో పరామర్శించారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.