Telangana7th Sep 11:10 AMSunil Byrisetty1 min read

జనం నాడి పసిగట్టిన సీఎం రేవంత్!

జనంతో ఎలా కనెక్ట్ కావాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదమో ?. వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో పలు కాలనీల్లోకి ప్రోటోకాల్ లేకుండా వెళ్లిపోయినప్పుడు అందరూ ప్రచారం కోసమ

జనం నాడి పసిగట్టిన సీఎం రేవంత్!
జనంతో ఎలా కనెక్ట్ కావాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదమో ?. వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో పలు కాలనీల్లోకి ప్రోటోకాల్ లేకుండా వెళ్లిపోయినప్పుడు అందరూ ప్రచారం కోసమని అనుకున్నారు. కానీ ఆయన అక్కడి వరకూ వెళ్లే వరకూ ఉన్నతాధికారులకు తప్ప ఎవరికీ తెలియదు. ఇప్పుడు గణేష్ నిమజ్జలనాల సమయంలోనూ ఆయన అదే విధంగా పబ్లిక్ ను ఆశ్చర్యపరిచారు. ప్రోటోకాల్.. అధికారిక వాహనాలు అనేవి లేకుండా నేరుగా ట్యాంక్ బండ్ మీదకు సీఎం వచ్చేశారు. సాధారణ భక్తుడిలా ట్యాంక్ బండ్ మీదకు వచ్చారు. గణపతి బప్ప మోరియా నినాదాలు చేశారు. భక్తులను ఉత్సాహపరిచారు. విధుల్లోఉన్న వారిని అభినందించారు. రేవంత్ రెడ్డి ఇలా రావడం వల్ల భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా సంతృప్తి వ్యక్తం చేసింది.
Telangana CM
Revanth Reddy
Public Connect
Hyderabad Floods
Ganesh Immersion
Tank Bund
Protocol Free Visit
Ganapati Bappa Morya
ప్రజలతో కనెక్ట్
భాగ్యనగర్ ఉత్సవ సమితి
Scroll for the next article