Telangana2nd Dec 05:01 PMSunil Byrisetty1 min read

దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. దుమారం

దేవుళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందువుల్లో మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారని.. ఒక్కో దేవుడిపై ఒక్కొక్కరికి ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంద

దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. దుమారం
దేవుళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందువుల్లో మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారని.. ఒక్కో దేవుడిపై ఒక్కొక్కరికి ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. మంగళవారం గాంధీభవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారికి మరో దేవుడు ఉన్నాడు. మందు తాగేవాళ్లకు, పప్పన్నం, మాంసం తినేవాళ్లకూ దేవుళ్లు ఉన్నారు' అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనూ అన్ని రకాల మనస్తత్వాలు కలిగినవారు ఉంటారని ఆయన తెలిపారు. దేవుడిపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు పార్టీలో ఎలా ఉంటుందని సీఎం అన్నారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Politics
Hindu Deities
Revanth Reddy
Controversy
Gandhi Bhavan Meeting
Devotee Reaction
భక్తుల ఆగ్రహం
వివాదం
రాజకీయ వివాదాలు
పబ్లిక్ రియాక్షన్
Scroll for the next article