News10th Nov 04:14 PMSunil Byrisetty1 min read

అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష

అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సీఎస్ కె.విజయానంద్, ఆర్ధిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ

అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష
అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సీఎస్ కె.విజయానంద్, ఆర్ధిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై సమావేశంలో చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాంతంలో వేర్వేరు జిల్లాల్లో ఆర్ధిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, సుస్ధిరాభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమావేశంలో చర్చ జరిపారు.
Andhra Pradesh
Amaravati
Visakhapatnam
Economic Region
Development Review
Chandrababu Naidu
Growth Hub
Economic Master Plan
Investment
Sustainable Development
Infrastructure
Government Meeting
Scroll for the next article