News25th Nov 12:50 PMSunil Byrisetty1 min read

ఉద్యాన పంటల ఆదాయం పెంపుపై సీఎం సమీక్ష

రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌తో చేయూతను ఇచ్చే అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పె

ఉద్యాన పంటల ఆదాయం పెంపుపై సీఎం సమీక్ష
రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌తో చేయూతను ఇచ్చే అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చిస్తున్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొదించాలని ఆదేశించారు. డ్రిప్, సాగునీరు, రవాణా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీ రాజ్ రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్లు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించం ద్వారా హార్టికల్చర్ రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, డిమాండ్ ఉన్న పంటల సాగు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Horticulture
Rayalaseema
Farmers Welfare
Agriculture Development
Purvodaya Scheme
ప్రభుత్వ సమీక్ష
ఫుడ్ ప్రాసెసింగ్
సబ్సిడీలు
మార్కెట్ సదుపాయాలు
Scroll for the next article