News25th Jul 09:55 AMSunil Byrisetty1 min read

ఆ రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్.. సీఎం థాంక్స్!

గుంతకల్ - బళ్లారి మధ్య 3, 4 రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర కెబినెట్ ఆమోదంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ,

ఆ రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్.. సీఎం థాంక్స్!
గుంతకల్ - బళ్లారి మధ్య 3, 4 రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర కెబినెట్ ఆమోదంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రూ.1,264 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని, మొత్తం పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో దేశంలోనే కీలకమైన 'తూర్పు - పడమర' రైల్వే కారిడార్ మరింత బలోపేతమయ్యేందుకు ఈ రైల్వే లైన్లు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ రైల్వే లైన్ల వల్ల రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. కొత్త రైల్వే లైన్ల ద్వారా పారిశ్రామిక వృద్ధి పెరిగి, సరికొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయని, కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన కనెక్టివిటి లభిస్తుందని వివరించారు. రైల్వే నెట్‌వర్క్‌పై రద్దీ తగ్గి.. ప్రయాణికులు, సరుకు రవాణా మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
Andhra Pradesh
Guntakal
Ballari
Railway Lines
Indian Railways
Narendra Modi
Ashwini Vaishnaw
N. Chandrababu Naidu
తూర్పు పడమర రైల్వే కారిడార్
కృష్ణపట్నం పోర్టు
రామాయపట్నం పోర్టు
రైల్వే కనెక్టివిటీ
కేంద్ర కేబినెట్
Scroll for the next article