News29th Sep 06:09 PMSunil Byrisetty1 min read
చిన్నారులకు విజయ్ మార్క్ రింగ్!
తమిళనాడులో మేనమామ బంగారపు ఉంగరం పేరుతో సీఎం విజయ్ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 755 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది విద్యుత్‌కు కేటాయించిన 650 కోట్ల రూపా
తమిళనాడులో మేనమామ బంగారపు ఉంగరం పేరుతో సీఎం విజయ్ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 755 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది విద్యుత్‌కు కేటాయించిన 650 కోట్ల రూపాయల బడ్జెట్ కంటే కూడా ఎక్కువగా ఉండడంతో దీనిపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు భారీ ఎత్తున అప్పులు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయని.. ఈ సమయంలో ఉచితాలకు ఖర్చు చేసే సొమ్మును ధరలకట్టడికి కేటాయించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే.. సీఎం విజయ్ చెన్నైలో మేనమామ బంగారం ఉంగరం పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీనిని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 22వ తేదీన ఆ తర్వాత పుట్టిన చిన్నారులకు ఈ పథకాన్ని అమలు చేస్తారు.