News6th Sep 12:30 PMSunil Byrisetty1 min read

అది అద్దెకు తీసుకున్న హెలికాఫ్టర్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం ప్రభుత్వం కొత్త హెలికాఫ్టర్‌ కొనుగోలు చేసిందన్న ప్రచారాన్ని సీఎం కార్యాలయం ఖండించింది. పాత హెలికాఫ్టర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, భద్రతా కా

అది అద్దెకు తీసుకున్న హెలికాఫ్టర్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం ప్రభుత్వం కొత్త హెలికాఫ్టర్‌ కొనుగోలు చేసిందన్న ప్రచారాన్ని సీఎం కార్యాలయం ఖండించింది. పాత హెలికాఫ్టర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆధునాతన ఎయిర్‌బస్ హెచ్‌-160 మోడల్ హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకున్నామని స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారంపై స్పష్టతనిచ్చింది. సామాజిక మాధ్యమాల్లో “సీఎం కోసం కొత్త హెలికాఫ్టర్‌ కొన్నారు” అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు వాస్తవాలను మాత్రమే నమ్మాలని, నిరాధార వార్తలను వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
Andhra Pradesh Government
Chandrababu Naidu
AP CM Helicopter
Airbus H160
CMO Clarification
Rented Helicopter
సోషల్ మీడియా రూమర్స్
భద్రత కారణాలు
సాంకేతిక సమస్యలు
Scroll for the next article