News24th Jul 09:41 AMSunil Byrisetty1 min read

పిల్లలున్న వారికి సీఎం బంపర్ ఆఫర్!

ఏపీలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు తరచుగా ప్రస్తావిస్తున్నారు. అందులో భాగంగా జనాభాను పెంచే చర్యలు ప్రారంభించారు. సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉ

పిల్లలున్న వారికి సీఎం బంపర్ ఆఫర్!
ఏపీలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు తరచుగా ప్రస్తావిస్తున్నారు. అందులో భాగంగా జనాభాను పెంచే చర్యలు ప్రారంభించారు. సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ఏపీ పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. నిపుణులు, మేధావుల సూచనలతో సంతానోత్పత్తి రేటును పెంచే విధంగా ప్రోత్సాహకాలను ప్రతిపాదించారు. ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే ఆ కుటుంబంకు ఆస్తి పన్ను మినహాయింపు ఉంటుందని ముసాయిదాలో చేర్చారు. ప్రసూతి సెలవులు ఆరు నెలలు నుంచి 12 నెలలకు పొడిగించారు. మూడో బిడ్డ ఉంటే అదనంగా రూ. 50 వేలు ప్రోత్సాహకం అందిస్తారు. నాలుగో బిడ్డకూ ఇది కొనసాగుతుంది. పిల్లలు పుట్టేందుకు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ట్రీట్మెంట్ కోసం ఆర్ధిక సహాయం అందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. తల్లులకు వర్క్‌ ఫ్రం హోం కల్పించాలని ముసాయిదాలో చేర్చారు.
Andhra Pradesh
CM Chandrababu
Population policyFamily Incentives
Ivf support
Maternity leave
Tax exemption
Work from home
సంతానోత్పత్తిప్రోత్సాహం
ఐవీఎఫ్‌ ఆర్థిక సహాయం
Scroll for the next article