News29th Mar 06:26 PMSunil Byrisetty1 min read

నీటిపై నుంచి గాల్లోకి.. ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు!

గాల్లో ఎగిరే విమానాలు, నీటిలో తేలే బోట్లు చూసుంటారు. కానీ ఏపీలో నీటిలో నుంచి గాల్లో ఎగిరే సరికొత్త విమానాలు రాబోతున్నాయి. పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న ర

నీటిపై నుంచి గాల్లోకి.. ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు!
గాల్లో ఎగిరే విమానాలు, నీటిలో తేలే బోట్లు చూసుంటారు. కానీ ఏపీలో నీటిలో నుంచి గాల్లో ఎగిరే సరికొత్త విమానాలు రాబోతున్నాయి. పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆలోచన చేసింది. ఇలాంటి సేవలు ఉన్న దేశాలు, రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. అనంతరం రాష్ట్రంలోనూ సీ ప్లేన్ సేవల్ని ఆరంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్రతీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC వచ్చే 3లోపు ప్రతిపాదనల్ని ఆహ్వానించింది. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే త్వరలోనే నీటిలోంచి గాల్లోకి ఎగిరే అవకాశం రానుంది.
Andhra pradesh
CM Chandra Babu
APADC
Scroll for the next article