News26th Jun 03:23 PMSunil Byrisetty1 min read
మూలధన వ్యయానికి మరింత ప్రాధాన్యం
రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై చర్చించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై
రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై చర్చించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతినెలా వెచ్చిస్తున్న ఖర్చతో పాటు.. రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై సమీక్షించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీ రాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం సూచించారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింది ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని అన్నారు.