News11th Sep 05:51 PMSunil Byrisetty1 min read

సీఎం వాటర్ మేనేజ్మంట్ విధానంతో సత్ఫలితాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాటర్ సెక్యూరిటీ, మేనజ్మెంట్ ఆలోచనా విధానం సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి నీటిబొట్టును ఒడిస

సీఎం వాటర్ మేనేజ్మంట్ విధానంతో సత్ఫలితాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాటర్ సెక్యూరిటీ, మేనజ్మెంట్ ఆలోచనా విధానం సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకుని రాష్ట్రంలో కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ముందుకు అడుగులు వేస్తున్నారన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జలవనరుల శాఖకు సంబందించిన పలు ప్రాజెక్టుల ప్రగతిపై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. గతేడాదితో పోల్చితే రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ , మేజర్, మీడియం రిజర్వాయర్ లలో నీటినిల్వలు పెరిగాయన్నారు. గత ఏడాది వర్షపాతం తో పోల్చితే, ఈ ఏడాది 9 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయినా కూడా భూగర్భజలాలు , మేజర్, మీడియం రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
Andhra Pradesh
Water Management
Water Security
Chandrababu Naidu
Irrigation Projects
Groundwater
Reservoirs
Rainfall
Public Policy
Sustainable Water Use
రిజర్వాయర్లు
వర్షపాతం
ప్రజా విధానం
నీటి సంరక్షణ
Scroll for the next article