Politics8th Sep 03:52 PMSunil Byrisetty1 min read

విజయోత్సాహంలో ‘కూట‌మి’

సూపర్ సిక్స్- సూపర్ హిట్ అయిందని కూటమి సంబరపడుతోంది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. ఈ నెల 10వ తేదీనాటికి 15 నెల‌లు నిండుతున్నాయి. ఈ క్ర‌మంలో కూట‌మి బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుక

విజయోత్సాహంలో ‘కూట‌మి’
సూపర్ సిక్స్- సూపర్ హిట్ అయిందని కూటమి సంబరపడుతోంది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. ఈ నెల 10వ తేదీనాటికి 15 నెల‌లు నిండుతున్నాయి. ఈ క్ర‌మంలో కూట‌మి బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు, ప్ర‌స్తుతం ఉన్న బ‌లాన్ని ప్ర‌జ‌ల ముందు చాటేందుకు మూడు పార్టీలు స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌మవు తున్నాయి. గ‌త 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌లు ఉమ్మ‌డిగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాయి. వైసీపీని ఓడించి అధికారంలోకి వ‌చ్చాయి. ఇక‌, ప్ర‌భుత్వం ప‌రంగా కూడా కూట‌మి నాయ‌కులు క‌ల‌సి క‌ట్టుగానే ముందుకు సాగుతున్నారు. భ‌విష్య‌త్తులోనూ కూట‌మి పార్టీలు క‌లిసే ఉంటాయ‌న్న సంకేతాలు ఇచ్చేందుకు.. వ‌చ్చే నాలుగేళ్ల పాల‌న‌ను మ‌రింత ప్ర‌జారంజ‌కంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈనెల 10న అనంత‌పురం వేదిక‌గా.. ‘సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్‌’ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.
Andhra Pradesh
Coalition Government
TDP
BJP
JanaSena
Super six superhit
కూటమి విజయోత్సాహం
చంద్రబాబు
పవన్ కళ్యాణ్
నారా లోకేష్
Scroll for the next article