Politics2nd Aug 05:00 PMSunil Byrisetty1 min read
రాష్ట్ర అభివృద్దే కూటమి ప్రభుత్వ సంకల్పం
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పే
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని 46వ డివిజన్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని విచారించారు. ఎవరికైనా సంక్షేమ పథకాలు అందుకున్నా, సమస్యలున్నా తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పలు చోట్ల సంక్షేమ పథకాల గురించి, సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.