News8th Aug 01:47 PMSunil Byrisetty1 min read
నేతన్నల హామీలు.. శరవేగంగా అమలు
ఎన్నికల ప్రచారంలో నేతన్నలకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య అన్నారు. మంగళగిరిలోని తెలుగుదే
ఎన్నికల ప్రచారంలో నేతన్నలకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచే చేనేత రంగానికి నూతన దిశ చూపేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానంతరం అత్యధిక ప్రజలు ఆధారపడిన రంగంగా చేనేత నిలిచిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు ప్రోత్సాహం కరువవ్వడంతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా లభించలేదన్నారు. 2024 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కష్టాలు పరిష్కరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.