News16th Dec 04:14 PMSunil Byrisetty1 min read

ఆక్వా కల్చర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కృష్ణా జి

ఆక్వా కల్చర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని మత్స్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హ‌జ‌ర‌య్యారు. ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ ల‌ వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు ఆక్వా రైతులపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, వాటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటోందన్నారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు ఉన్న నాణ్యత, విశ్వసనీయతపై విస్తృత ప్రచారం అవసరమని, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఎగుమతుల పెంపు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నాణ్యతపై ప్రతి రైతు దృష్టి పెట్టాలని, అప్పుడే మంచి ధర లభిస్తుందన్నారు. దేశ మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 29 శాతం ఉందని తెలిపారు.
Andhra Pradesh Aquaculture
Aquaculture Development
Aqua Farmers
Fisheries Sector
Shrimp Exports
AP Fisheries
Coalition Government
Kinjarapu Achchennaidu
నాణ్యత ప్రమాణాలు
ఆక్వా పరిశ్రమ
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
మత్స్యరంగ అభివృద్ధి
Scroll for the next article