Education25th Aug 10:52 AMSunil Byrisetty1 min read

యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం

యువత కలలు కన్న భవిష్యత్ ను సీఎం చంద్రబాబు సాకారం చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు అందించారని పే

యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం
యువత కలలు కన్న భవిష్యత్ ను సీఎం చంద్రబాబు సాకారం చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు అందించారని పేర్కొన్నారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్–2026 విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పలు ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడనున్నాయని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్–1, గ్రూప్–2తో పాటు పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారని తెలిపారు.
AP News
Job Calendar 2026
Andhra Pradesh Jobs
Government Jobs
10
060 Posts
Chandrababu Naidu
Mandipalli Ramprasad Reddy
Coalition Government
Group 1
Group 2
DSC
Teacher Jobs
Police Jobs
Unemployed Youth
Job Notifications
Scroll for the next article