News17th Sep 03:39 PMSunil Byrisetty1 min read
విశ్వకర్మ స్ఫూర్తితో కూటమి పాలన
సువర్ణ లంకా నగరం, ద్వారక, ఇంద్రప్రస్థం వంటి అద్భుత నగరాలను నిర్మించిన విరాట్ విశ్వకర్మ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేతి వృత్తుదారులకు ఆర్
సువర్ణ లంకా నగరం, ద్వారక, ఇంద్రప్రస్థం వంటి అద్భుత నగరాలను నిర్మించిన విరాట్ విశ్వకర్మ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేతి వృత్తుదారులకు ఆర్థిక మేలు కలిగేలా పథకాలు రూపొందిస్తూ, అభినవ విశ్వకర్మగా రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి సవిత పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు ఆద్యుడు విశ్వకర్మ భగవానుడు అని అన్నారు. హిందూ పురాణాల ప్రకారం సత్యయుగంలో దేవతల నివాసానికి స్వర్గలోకం, త్రేతాయుగంలో సువర్ణ లంకను, ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని, కలియుగంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థం, పాండవులు నివసించిన మయసభను విశ్వకర్మ నిర్మించారన్నారు. విశ్వకర్మ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. చేతి వృత్తుదారులకు సీఎం చంద్రబాబు అండగా ఉంటూ, గీత, వడ్డెర, చేనేత, ఇతర వృత్తులకు ఆర్థిక మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. త్వరలో రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టనున్నారన్నారు.