News28th Sep 10:54 AMSunil Byrisetty1 min read
సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం
కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనులకు సంబంధించి రూ.160 కోట్ల బిల్లులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జలవనరుల శాఖ మంత్ర
కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనులకు సంబంధించి రూ.160 కోట్ల బిల్లులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై, దెబ్బతిన్న సాగునీటి వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గాడిలో పెడుతోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రద్దు చేసిన సాగునీటి సంఘాల వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ధరించి రైతులకు కొండంత భరోసా కల్పించారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పరిమిత జల వనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. రైతుల భాగస్వామ్యంతోనే సాగునీటి నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.