News17th Aug 04:55 PMSunil Byrisetty1 min read
భవన నిర్మాణ కార్మికులకు మళ్లీ భరోసా
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంఖ్య ఎందుకు పెరగడం లేదన్న అంశంపై
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంఖ్య ఎందుకు పెరగడం లేదన్న అంశంపై శాసనసభలో మంత్రి వివరణ ఇచ్చారు. 2018–19 నాటికి రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని మంత్రి తెలిపారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 1214 మెమో ద్వారా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలను రద్దు చేయడంతో నమోదు ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గత రెండు నెలల్లోనే 6,777 మంది కార్మికులు కొత్తగా నమోదు చేసుకున్నారని వెల్లడించారు. అర్హులైన కార్మికులు సులభంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ‘మిత్ర’ యాప్ ద్వారా కూడా అవకాశం కల్పించిందని తెలిపారు.