News20th Jul 03:06 PMSunil Byrisetty1 min read

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం

అంగన్వాడీలకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నాయకురాలు ఆచంట సునీత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగ

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం
అంగన్వాడీలకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నాయకురాలు ఆచంట సునీత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని కొనియాడారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంగన్వాడీల చిరకాల వాంఛను నెరవేర్చిందని చెప్పారు. 'తల్లికి వందనం' కార్యక్రమం ద్వారా 17 వేల మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 86 లక్షలు కేటాయించిన విషయాన్ని వివరించారు. కూర్చోడానికి సరైన స్థలం, ఫ్యాన్లు, చాపలు కూడా లేని గత పరిస్థితిని మార్చి, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేలా సీఎం చంద్రబాబు, మంత్రి సంధ్యారాణి, నారా లోకేష్ శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. రూ. 200గా ఉన్న అంగన్వాడీల జీతాన్ని దశలవారీగా రూ. 11,500 వరకు పెంచిన చరిత్ర ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే ఉందన్నారు.
Andhra Pradesh
TDP
Coalition Government
Achanta Sunitha
Anganwadi
Thalliki Vandanam
మహిళా శిశు సంక్షేమం
చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
Scroll for the next article