Education29th Aug 04:57 PMSunil Byrisetty1 min read

డీఎస్సీ విజేతలకు కూటమి ప్రభుత్వమే రక్షణ కవచం!

రాజకీయ లబ్ధి కోసం, కష్టపడి ఉద్యోగాలు సాధించిన నిరుపేద ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రెవ

డీఎస్సీ విజేతలకు కూటమి ప్రభుత్వమే రక్షణ కవచం!
రాజకీయ లబ్ధి కోసం, కష్టపడి ఉద్యోగాలు సాధించిన నిరుపేద ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. మెగా డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో మనోవేదనకు గురవుతున్న డీఎస్సీ విజేతల్లో ధైర్యం నింపేందుకు మంత్రి అనగాని రేపల్లె పట్టణంలో పర్యటించారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన సుధీర్, ఫాసియా బేగం, లావణ్య, నవ్య తదితర అభ్యర్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి , డీఎస్సీలో ఉద్యోగం కోసం వారు కష్టపడిన వైనాన్ని తెలుసుకుంటూ.. డీఎస్సీపై జరుగుతున్న ప్రచారాలతో వారు పడుతున్న ఆవేదనను తెలుసుకున్నారు. మెగా డీఎస్సీపై జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, డీఎస్సీ విజేతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మనోధైర్యాన్ని అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారని, కేవలం 148 రోజుల్లోనే అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియను పూర్తి చేశామని రెవెన్యూ శాఖ మంత్రి తెలిపారు.
Andhra Pradesh
Mega DSC
DSC Results
DSC Winners
Teacher Recruitment
Chandrababu Naidu
Anagani Satyaprasad
Teacher Jobs
Scroll for the next article