Politics24th Oct 05:31 PMSunil Byrisetty1 min read

బందరు కార్పొరేషన్ కూటమిదే

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేయడం తథ్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నగరంలో పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ల జగన్నాథ రావు, కూటమి మేయ

బందరు కార్పొరేషన్ కూటమిదే
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేయడం తథ్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నగరంలో పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ల జగన్నాథ రావు, కూటమి మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబిదాతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ హామీలను, చేసిన అభివృద్ధిని వివరించారు. పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి చాలా మంచి స్పందన లభిస్తోందని, కూటమి అభ్యర్థులను అమూల్యమైన ఓట్లతో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఘనమైన చరిత్ర కలిగిన మచిలీపట్నంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తరకటూరులో 200 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేశాం. వాటర్ ఫిల్ట్రేషన్ కోసం రూ. 16 కోట్లు వెచ్చించి ప్రతిరోజూ మంచినీరు అందించేలా చర్యలు చేపట్టాము. భవిష్యత్తులో కృష్ణా నీటిని నేరుగా పంపింగ్ చేసి మచిలీపట్నానికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గతంలో నిలిచిపోయిన డ్రైనేజీ పనులను మళ్లీ గాడినపెట్టి, సుమారు రూ. 65 కోట్ల వ్యయంతో నూతన పనులు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
Scroll for the next article