News13th Sep 10:38 AMSunil Byrisetty1 min read

కూటమి కష్టపడితే.. 100 శాతం స్ట్రైక్ రేట్!

విజయవాడలో కూటమి పార్టీల ముఖ్య నేతల సమావేశం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతి స్థానంలో విజయాన్ని సాధించి 100 శాతం స్ట్రై

కూటమి కష్టపడితే.. 100 శాతం స్ట్రైక్ రేట్!
విజయవాడలో కూటమి పార్టీల ముఖ్య నేతల సమావేశం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతి స్థానంలో విజయాన్ని సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేయడమే లక్ష్యంగా సమావేశంలో చర్చించారు. సమావేశానికి మంత్రి, జనసేన ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్ కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలుపే ఏకైక లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. కూటమిలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి పోటీ చేసినప్పటికీ, మిగిలిన రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారం అందించి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల మధ్య ఐక్యత, పరస్పర సహకారంతో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయాన్ని సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించే దిశగా సమష్టిగా పనిచేయాలని నేతలు స్పష్టం చేశారు.
Andhra Pradesh
Coalition Parties
Local Body Elections
NTR District
Vijayawada
Kandula Durgesh
Kesineni Sivanath
Kesineni Chinni
Adduri Sriram
టీడీపీ
జనసేన
బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఎన్నికల వ్యూహం
కూటమి ఐక్యత
స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article