National25th Jul 03:22 PMSunil Byrisetty1 min read
నెగ్గిన బొద్దింకల పోరాటం!
కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం ఫలించింది. వారు చేసిన డిమాండ్లకు కేంద్రం తలొగ్గింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత
కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం ఫలించింది. వారు చేసిన డిమాండ్లకు కేంద్రం తలొగ్గింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్'లో పోస్టు చేశారు. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయని, నీట్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించామని చెప్పారు. మళ్లీ పరీక్షను నిర్వహించి, ఫలితాలు విడుదల చేశామన్నారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇంక యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలని కోరారు.