News21st Nov 09:34 AMSunil Byrisetty1 min read
విశాఖకు మరో దిగ్గజ సంస్థ.. జనవరి నుంచి ‘కాగ్నిజెంట్’
ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ విశాఖలో కొలువుతీరుతున్నాయి. తాజాగా దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు
ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ విశాఖలో కొలువుతీరుతున్నాయి. తాజాగా దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో తొలుత డెలివరీ సెంటర్ను 800 మంది ఉద్యోగులతో ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇతర కాగ్నిజెంట్ సెంటర్లలో పనిచేసే కొందరిని ఇక్కడికి తరలించనుంది. కాగా ప్రభుత్వం ఈ కంపెనీకి కాపులుప్పాడలో 21.33 ఎకరాలను కేటాయించింది. రూ.1,583 కోట్లతో కార్యాలయ నిర్మాణం, 8వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది.