News15th Jan 04:54 PMSunil Byrisetty1 min read
ముగిసిన "కోల్డ్ వేవ్ 2.0"
మహాశివరాత్రి వరకు కొనసాగాల్సిన చలికాలం.. ఈసారి సంక్రాంతికి ముందే వీడ్కోలు పలకడం విశేషం. ఈ క్రమంలోనే తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో ఇంకా మంచు కురుస్తున్నా.. పగటిపూట మాత్రం ఎండ తీ
మహాశివరాత్రి వరకు కొనసాగాల్సిన చలికాలం.. ఈసారి సంక్రాంతికి ముందే వీడ్కోలు పలకడం విశేషం. ఈ క్రమంలోనే తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో ఇంకా మంచు కురుస్తున్నా.. పగటిపూట మాత్రం ఎండ తీవ్రత పెరుగుతోందని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు ఎముకలు కొరికిన చలిగాలుల స్థానంలో ఇప్పుడు వెచ్చని గాలులు వీస్తున్నాయి. నేడు, రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీల వరకు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల కొనసాగిన రెండో దశ చలిగాలులు అధికారికంగా ముగిసినట్లు వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. రానున్న పది రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉండనున్నాయని, తీవ్రమైన చలి తిరిగి వచ్చే అవకాశాలు లేవని తెలిపారు.