News13th Sep 03:48 PMSunil Byrisetty1 min read

స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో బాల్య వివాహ ర‌హిత స‌మాజం

ఆల‌యాల్లో జ‌రిగే వివాహాల‌పై అధికారులు ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని.. ప్ర‌తి వివాహం త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం క‌లెక్ట‌ర్

స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో బాల్య వివాహ ర‌హిత స‌మాజం
ఆల‌యాల్లో జ‌రిగే వివాహాల‌పై అధికారులు ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని.. ప్ర‌తి వివాహం త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. క‌లెక్ట‌ర్ కార్యాల‌య శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో వాస‌వ్య మ‌హిళా మండ‌లి, జ‌స్ట్ రైట్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ స్వ‌చ్ఛంధ సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా మ‌త పెద్ద‌లు.. పేరిట ప్ర‌త్యేక స‌మావేశం జ‌రిగింది. విజ‌య‌వాడ న‌గ‌రంతో పాటు జిల్లాలోని వివిధ దేవాల‌యాల అధికారులు హాజ‌రైన ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని స‌మాజ నిర్మాణానికి స‌మ‌ష్టి భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌ని.. బాల్య వివాహ ర‌హిత జిల్లాగా ఎన్‌టీఆర్ జిల్లాను తీర్చిదిద్ది, ఆద‌ర్శంగా నిల‌ప‌డంలో ప్ర‌తిఒక్క‌రూ చేయీచేయీ క‌ల‌పాల‌ని పేర్కొన్నారు. ప్ర‌తి దేవాల‌యంలో వివాహానికి అర్హ‌త వ‌య‌సు, వ‌య‌సు ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు, చ‌ట్ట నియ‌మ నిబంధ‌న‌లు తెలియ‌జేసేలా ప్ర‌ద‌ర్శ‌న బోర్డులు ఏర్పాటు చేయాల‌న్నారు. ఆల‌యాల్లో జ‌రిగే వివాహాల‌పై ఈవోలు ప్ర‌త్యేకంగా దృష్టిసారించి, ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. బాల్య వివాహాలకు అడ్డుక‌ట్ట వేసేందుకు సిబ్బందికి అవగాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌న్నారు. బాల్య వివాహాల‌పై ఫిర్యాదు చేసేందుకు 112 నంబ‌రుతో పాటు ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098కూడా అందుబాటులో ఉన్నాయ‌న్నారు.
Andhra Pradesh
Child Marriage Free
Collective Effort
Awareness
Social Change
Women Empowerment
Child Rights
సమాజ సహకారం
ఎన్‌టీఆర్ జిల్లా
బాల్య వివాహాల నివారణ
Scroll for the next article