News30th Jul 03:31 PMSunil Byrisetty1 min read

ప్ర‌తి బ్యాంకు బ్రాంచ్‌లోనూ క్రెడిట్ డే

సీసీఆర్‌సీ కార్డులున్న ప్ర‌తి అన్న‌దాత‌కూ స‌త్వ‌రం పంట రుణాలు మంజూరు చేయాల‌ని.. ఇందుకు ప్ర‌తి బ్యాంకు బ్రాంచ్‌లో క్రెడిట్ డే నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ బ్యా

ప్ర‌తి బ్యాంకు బ్రాంచ్‌లోనూ క్రెడిట్ డే
సీసీఆర్‌సీ కార్డులున్న ప్ర‌తి అన్న‌దాత‌కూ స‌త్వ‌రం పంట రుణాలు మంజూరు చేయాల‌ని.. ఇందుకు ప్ర‌తి బ్యాంకు బ్రాంచ్‌లో క్రెడిట్ డే నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ బ్యాంక‌ర్ల‌కు సూచించారు. సీసీఆర్‌సీ కార్డులున్న కౌలు రైతుల‌కు సాగు రుణాల మంజూరుపై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. కౌలు రైతుల‌కు 56 వేల సీసీఆర్‌సీ కార్డుల జారీ ల‌క్ష్యం కాగా ఇప్ప‌టికే 42,415 కార్డులు అందించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో వారికి స‌త్వ‌రం బ్యాంకులు రుణాలు అందించేందుకు చొర‌వ చూపాల‌న్నారు. రుణాలు పొంద‌డం వారి హ‌క్కు అని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు.. బ్రాంచుల వారీగా నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు కృషి చేయాల‌న్నారు. వ్య‌వ‌సాయ భూమి క‌లిగిన య‌జ‌మానులు, సీసీఆర్‌సీ కార్డులు పొందిన సాగుదారులు ప‌థ‌కాల్లో చేరేందుకు అర్హుల‌ని వివ‌రించారు.
Andhra Pradesh news
NTR District
Agriculture
Crop Loans
CCRC Cards
Tenant Farmers
Bank Credit Day
Collector Lakshmisha
Joint Collector Ilakkiya
బ్యాంకు రుణ మంజూరు
సీసీఆర్‌సీ కార్డులు
Scroll for the next article