News3rd Nov 04:44 PMSunil Byrisetty1 min read

దివ్యాంగ విద్యార్థులకు లాప్ టాప్‌ల అందజేత

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దివ్యాంగ విద్యార్థులకు లాప్ టాప్‌లు అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ లోని శ్రీ పింగళి వెంకయ్య

దివ్యాంగ విద్యార్థులకు లాప్ టాప్‌ల అందజేత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దివ్యాంగ విద్యార్థులకు లాప్ టాప్‌లు అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో దివ్యాంగ విద్యార్థులకు లాప్ టాప్ లను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ అందజేశారు. రూ.1,40,000/- విలువైన నాలుగు ల్యాప్టాప్ లను పీహెచ్ డి, డిగ్రీ, బీటెక్ చదివే వినికిడి లోపం, కంటి చూపు సమస్య, శారీరక వైకల్యం గల విద్యార్థులకు అందజేశారు. ఉన్నత విద్య అభ్యసించే దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని, అందులో భాగంగా విద్యార్థులకు లాప్టాప్ లు అందజేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డిఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Andhra Pradesh
NTR District
Divyang Students
Laptop Distribution
Collector G Lakshmisha
Vijayawada
Differently Abled Welfare
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం
విద్యా సహాయం
Scroll for the next article