News6th Aug 03:22 PMSunil Byrisetty1 min read
నానో ఎరువులతో పైరుకు ఆదరవు
విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడకుండా అన్నదాతలకు అవగాహన కల్పించాలని.. పంట నాణ్యత, ఉత్పత్తిని పెంచడంతో పాటు డబ్బును, సమయాన్ని ఆదా చేసే నానో ఎరువులుపై అన్నదాతలకు స
విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడకుండా అన్నదాతలకు అవగాహన కల్పించాలని.. పంట నాణ్యత, ఉత్పత్తిని పెంచడంతో పాటు డబ్బును, సమయాన్ని ఆదా చేసే నానో ఎరువులుపై అన్నదాతలకు సమన్వయ శాఖల అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఏపీ మార్క్‌ఫెడ్ ఇగ్నైట్‌సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. ఖరీఫ్ సీజన్ (2025-26)కు సంబంధించిన వివిధ పంటల కనీస మద్దతు ధరలు, ఏపీ మార్క్‌ఫెడ్ రైతులకు అందిస్తున్న సేవలు, సీఎం ఎయిడ్, సీఎం యాప్, మార్క్ రే ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫామ్ తదితర వివరాలతో రూపొందించిన పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. అదేవిధంగా నానో యూరియా, నానో డీఏపీ, నానో జింక్, నానో కాపర్ తదితర ఎరువుల బాటిళ్లను పరిశీలించారు. నానో ఎరువులను తేలిగ్గా స్ప్రే చేయగలిగే కిసాన్ డ్రోన్ పనితీరును పరిశీలించారు. నానో ఎరువుల వల్ల దాదాపు 50 శాతం మేర ఎరువుల ఆదా అవుతుందని.. పంట రకాలు, వివిధ దశల్లో వినియోగించాల్సిన మోతాదు, స్ప్రేయర్ల వినియోగం తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో వీటిపై అవగాహన కల్పించాలన్నారు.