News25th Jul 04:52 PMSunil Byrisetty1 min read

నైపుణ్యాల‌ు నేర్చుకొని సృజ‌న‌తో ఎద‌గాలి

మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని సృజనాత్మకతతో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్

నైపుణ్యాల‌ు నేర్చుకొని సృజ‌న‌తో ఎద‌గాలి
మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని సృజనాత్మకతతో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. ఇబ్ర‌హీంప‌ట్నం రైజ్ కేంద్రంలో పైప్ క్లీన‌ర్ (మెత్తని చెనిల్ వస్త్రంతో చుట్టిన వంగే తీగ)తో త‌యారు చేసే హ‌స్త‌క‌ళా ఉత్ప‌త్తుల‌పై వ‌ర్క్‌షాప్ జ‌రిగింది. శ్రావ్స్ ఎండ్‌లెస్ క్రాఫ్ట్స్ వ్య‌వ‌స్థాప‌కులు శ్రావ‌ణి 60 మంది స్వ‌యం స‌హాయ‌క సంఘ మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. బొకేలు త‌యారీ, అలంక‌ర‌ణ వ‌స్తువులు, ఆక‌ర్ష‌ణీయ బ‌హుమ‌తులు వంటివి త‌యారు చేయ‌డాన్ని నేర్పించారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకుని వాటిని ఉపాధి అవకాశాలుగా మలచుకోవడం ద్వారా మహిళలు ఆర్థిక సాధికార‌త‌కు చేరువ‌కావొచ్చ‌ని పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ప్రారంభించగలిగే ఇటువంటి హస్తకళా ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వ శాఖలు, రైజ్ కేంద్రం అందిస్తున్న శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఆయ‌న పిలుపునిచ్చారు.
Andhra Pradesh
Dr G Lakshmisha
Women Empowerment
Skill Development
Self Employment
RISE Centre
Ibrahimpatnam
Self Help Groups
మహిళా పారిశ్రామికవేత్తలు
ఉపాధి అవకాశాలు
సృజనాత్మకత
శిక్షణ కార్యక్రమం
Scroll for the next article