News24th Oct 05:32 PMSunil Byrisetty1 min read

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి

2018-19 సంవత్సరంలో మెగా గోకులాల పేరిట నిర్మాణం చేపట్టిన సామాజిక పశువుల చావిడి (కమ్యూనిటీ క్యాటిల్ షెల్టర్) లను సక్రమంగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అ

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
2018-19 సంవత్సరంలో మెగా గోకులాల పేరిట నిర్మాణం చేపట్టిన సామాజిక పశువుల చావిడి (కమ్యూనిటీ క్యాటిల్ షెల్టర్) లను సక్రమంగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగ్గయ్యపేట మండలం బండిపాలెం, పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయి గూడెంలలోని సామాజిక పశువుల చావిడి (కమ్యూనిటీ క్యాటిల్ షెల్టర్) లను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలసి పరిశీలించారు. లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు సామాజిక పశువుల చావిడుల నిర్మాణాన్ని గతంలో చేపట్టారని, అవి వివిధ స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. నాడు మెగా గోకులం పేరిట ఒక్కోదాని నిర్మాణానికి ఇరవై ఒక్క లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపారని చెప్పారు. ఒక్కో షెల్టర్లో 20 పశువులకు ఆశ్రయం కల్పించాలన్నది లక్ష్యమని తెలిపారు. వసతిలేని పాడి రైతులకు ప్రయోజనం కలిగించాలన్న ఉద్దేశ్యంతో వీటి నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.
Andhra Pradesh
NTR District
Livestock Development
Community Cattle Shelter
Mega Gokulam
Collector G. Lakshmisha
గ్రామీణ సంక్షేమం
పాడి రైతులు
పశు అభివృద్ధి
Scroll for the next article