Spiritual26th Sep 11:33 AMSunil Byrisetty1 min read

ఖాదర్ బాబా జయంతి వేడుకకు.. జిల్లా కలెక్టర్ కు ఖలీల్ బాబు ఆహ్వానం..

నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఎస్ రాం సుందర్ రెడ్డిను బాబామెట్టలోని ప్రముఖ సూఫీ క్షేత్రం హజరత్ బాబా సయ్యద్ ఖాదర్ షా వలీ దర్గా దర్బార్ ముతవల్లి, ఏటికే వెలుగు అనాధ వృద్ధా

ఖాదర్ బాబా జయంతి వేడుకకు.. జిల్లా కలెక్టర్ కు ఖలీల్ బాబు ఆహ్వానం..
నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఎస్ రాం సుందర్ రెడ్డిను బాబామెట్టలోని ప్రముఖ సూఫీ క్షేత్రం హజరత్ బాబా సయ్యద్ ఖాదర్ షా వలీ దర్గా దర్బార్ ముతవల్లి, ఏటికే వెలుగు అనాధ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ ముహమ్మద్ ఖలీల్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ ఛాంబర్ లో గురువారం కలెక్టర్ ను కలిసిన ఖలీల్ బాబు ఆయన్ను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా శుక్రవారం జరగబోవు సూఫీ మహనీయులు హజరత్ ఖాదర్ బాబా వారి 129 వ జయంతి మహోత్సవానికి విచ్చేయ వలసిందిగా కలెక్టర్ ఎస్ రాం సుందర్ రెడ్డి కు ఆహ్వాన పత్రికను అందచేసి గౌరవ పూర్వకంగా ఆహ్వానించారు. ఈ ప్రత్యేక వేడుకకు విచ్చేసి ఉత్సవం సందర్భంగా నిర్వహించే పరమ పవిత్ర అన్న సమారాధనను తమ చేతుల మీదుగా ప్రారంభించాలని ఖలీల్ బాబు జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డిను ఆత్మీయ పూర్వకంగా ఆహ్వానించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తిని కలిసిన ఖలీల్ బాబు ఆయనకు కూడా ఆహ్వాన పత్రికను అందించి ఖాదర్ బాబా ఉత్సవానికి విచ్చేయ వలసిందిగా ఆహ్వానించారు.
Andhra Pradesh
Khader Baba Jayanthi
Sufi Celebrations
Hazrat Khader Shah Wali
District Collector
Khalil Babu
Baba Metta Dargah
హజరత్ ఖాదర్ బాబా 129వ జయంతి
Scroll for the next article