News9th Jul 05:40 PMSunil Byrisetty1 min read
వెల్‌డన్ కలెక్టర్ లక్ష్మీ శ.. కీప్ ఇట్ అప్..
ఎక్కడ విధులు నిర్వర్తించినా, ఏ హోదాలో ఉన్నా జనం నాడి పట్టి వారి బాగోగుల కోసం పరితపించే వ్యక్తిగా ఐఏఎస్ అధికారి డా. జి.లక్ష్మీశకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఎన్‌ట
ఎక్కడ విధులు నిర్వర్తించినా, ఏ హోదాలో ఉన్నా జనం నాడి పట్టి వారి బాగోగుల కోసం పరితపించే వ్యక్తిగా ఐఏఎస్ అధికారి డా. జి.లక్ష్మీశకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్‌గా, జిల్లా రెడ్‌క్రాస్ శాఖ అధ్యక్షులుగా సేవలందిస్తున్న ఆయనకు తాజాగా మరో పురస్కారం లభించింది. రెడ్‌క్రాస్‌కు నిధుల సమీకరణ, సభ్యత్వ నమోదులో విశేష ప్రతిభ కనబరచడమే కాకుండా.. సామాజిక సేవలో చేసిన కృషికి గుర్తింపుగా గౌరవ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ అవార్డు అందుకున్నారు. వెల్ డన్.. కీప్ ఇట్ అప్ అంటూ లక్ష్మీశను గవర్నర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో రెడ్‌క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.