News17th Jun 03:08 PMSunil Byrisetty1 min read

వినూత్న విధానాల‌తో గాలి నాణ్య‌త‌ను పెంచుదాం

ఆరోగ్య ఆంధ్ర సాకారానికి, కాలుష్య రహిత సమాజానికి మ‌నం పీల్చే గాలి స్వ‌చ్ఛంగా ఉండటం కీలకమని.. వినూత్న విధానాల‌తో విజ‌య‌వాడ న‌గ‌రం వాయు కాలుష్యం బారిన ప‌డ‌కుండా స‌మ‌ష్టి కృషి అవ‌స‌ర‌మ

వినూత్న విధానాల‌తో గాలి నాణ్య‌త‌ను పెంచుదాం
ఆరోగ్య ఆంధ్ర సాకారానికి, కాలుష్య రహిత సమాజానికి మ‌నం పీల్చే గాలి స్వ‌చ్ఛంగా ఉండటం కీలకమని.. వినూత్న విధానాల‌తో విజ‌య‌వాడ న‌గ‌రం వాయు కాలుష్యం బారిన ప‌డ‌కుండా స‌మ‌ష్టి కృషి అవ‌స‌ర‌మ‌ని, ఇందుకు భాగ‌స్వామ్య ప‌క్షాలు చేయీచేయీ క‌ల‌పాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జాతీయ శుద్ధ వాయు కార్య‌క్ర‌మం (ఎన్‌సీఏపీ) అమ‌లుపై స‌మీక్షించేందుకు విజ‌య‌వాడ న‌గ‌ర ఇంప్లిమెంటేష‌న్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. కాలుష్య నియంత్ర‌ణ‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, ర‌వాణా, ప‌రిశ్ర‌మ‌లు త‌దిత‌ర శాఖ‌లు వాయు నాణ్య‌త‌ను పెంచేందుకు చేప‌ట్టిన ప‌నులు, వాటిలో పురోగ‌తిపై స‌మీక్షించి, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు మార్గ‌నిర్దేశం చేశారు. న‌గ‌రం న‌లువైపులా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ మానిట‌రింగ్ స్టేష‌న్ల డేటాను ఎప్ప‌టిక‌ప్పుడు విశ్లేషించి.. దుమ్మూధూళీ వ్యాప్తి చెంద‌కుండా, గాలిలో పీఎం10 సూక్ష్మ ధూళిక‌ణాల‌ను ల‌క్ష్యాల మేర‌కు త‌గ్గించే కార్య‌క్ర‌మాలు ప‌టిష్టంగా అమ‌ల‌య్యేలా చూడాల‌న్నారు.
Andhra Pradesh news
Vijayawada
Collector Lakshmisha
NCAP implementation to improve air quality
కాలుష్య నియంత్రణ
ఆరోగ్య ఆంధ్ర
ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్
Scroll for the next article